సోషల్ మీడియాలో ఫాలోవర్లు పెరిగితే భారీ బోనస్.. ఉద్యోగులకు చైనా బాస్ బంపరాఫర్!
- సోషల్ మీడియాలో ఫాలోవర్లను పెంచుకుంటే ఉద్యోగులకు భారీ బోనస్
- ప్రతి 10,000 మంది ఫాలోవర్లకు రూ.1.4 లక్షలు ఇస్తున్న చైనా కంపెనీ
- ఉద్యోగుల అకౌంట్ల ద్వారా ఫ్రీ మార్కెటింగ్ చేయడమే సీఈఓ వ్యూహం
- ఎలాన్ మస్క్ తన ప్రధాన ప్రత్యర్థి అని ప్రకటించిన సీఈఓ యు హావో
- 2026 చివరి నాటికి $22 బిలియన్ల విలువను అందుకోవడమే కంపెనీ లక్ష్యం
సోషల్ మీడియాలో ఫాలోవర్లను పెంచుకుంటే చాలు.. కంపెనీ జీతంతో పాటు అదనంగా భారీ బోనస్ ఇస్తామంటూ చైనాకు చెందిన ఒక టెక్ పారిశ్రామికవేత్త తన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ‘డ్రీమ్ టెక్నాలజీ’ అనే ప్రముఖ స్మార్ట్ హోమ్ అప్లయన్సెస్ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ ‘యు హావో’ (39) ఈ వినూత్నమైన స్కీమ్‌ను తీసుకొచ్చారు. ఆన్‌లైన్‌లో ఉద్యోగులు సాధించే ప్రతి 10,000 మంది ఫాలోవర్లకు దాదాపు రూ.1.4 లక్షల నగదు బహుమతి ఇస్తామని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
ఫాలోవర్లు పెరిగితే
ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లకు ఫాలోవర్లు పెరిగితే ఆ నెట్‌వర్క్ ద్వారా కంపెనీ ఉత్పత్తులకు ఉచితంగానే గ్లోబల్ మార్కెటింగ్ జరుగుతుందని యు హావో భావిస్తున్నారు. అంటే ఉద్యోగుల వ్యక్తిగత ఖాతాలనే కంపెనీకి అధికారిక ప్రచార సాధనాలుగా మార్చాలనేది ఆయన వ్యూహం. ఈ సరికొత్త నిబంధనపై కంపెనీలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. పెద్ద కంపెనీల్లో ఇలాంటివి తప్పవని, ఉద్యోగాలు కాపాడుకోవడానికి ఒకరి అకౌంట్లను మరొకరు ఫాలో అవ్వక తప్పట్లేదంటూ కొందరు ఉద్యోగులు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు.
క్రేజీ బాస్ ఆన్‌లైన్ స్టంట్స్
ఆన్‌లైన్‌లో వింత పనులు చేస్తూ వ్యూస్ పెంచుకోవడంలో యు హావో చైనాలో చాలా పాప్యులర్. అందుకే అతడిని అంతా ‘క్రేజీ బాస్’ అని పిలుస్తుంటారు. కంపెనీ ప్రమోషన్ కోసం గతంలో ఈయన ఏఐ ద్వారా సృష్టించిన మహిళల దుస్తుల్లో ఉన్న తన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి భారీ ఎంగేజ్‌మెంట్‌ను సాధించారు. అంతేకాదు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తన ప్రధాన ప్రత్యర్థి అని, రాబోయే ఐదేళ్లలో తానే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఎదుగుతానని ఓ వీడియోలో ప్రకటించి సంచలనం సృష్టించారు.
వేగంగా ఎదుగుతున్న కంపెనీ
రోబో వాక్యూమ్ క్లీనర్లు, హై-ఎండ్ హోమ్ అప్లయన్సెస్ తయారు చేసే ఈ సంస్థ 2017లో ప్రారంభమై అత్యంత వేగంగా వృద్ధి చెందింది. ఒకానొక దశలో ఈ కంపెనీ విలువ $6.6 బిలియన్లు ఉండగా.. ఈ 2026 చివరి నాటికి దీని మార్కెట్ విలువను ఏకంగా $22 బిలియన్లకు చేర్చాలని ఈ క్రేజీ బాస్ లక్ష్యంగా పెట్టుకున్నారు.